TG: SEC ముత్యాలమ్మ ఆలయం దగ్గర జరిగిన లాఠీఛార్జ్‌పై నార్త్ జోన్ DCP సాధన రష్మీ పెరుమాళ్ వివరణ ఇచ్చారు. హిందూ సంఘాలు శాంతియుత బంద్‌కు పిలుపునిచ్చి 3 వేల మందితో ర్యాలీ నిర్వహించారని తెలిపారు. ర్యాలీలో కొంతమంది యువకులు పోలీసులపై రాళ్లు, చెప్పులు, కుర్చీలతో దాడి చేయడం ప్రారంభించారని, 12 మంది పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయన్నారు. పరిస్థితి కంట్రోల్ చేయడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని డీసీపీ చెప్పారు.