TG: డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. HYD గోషామహల్ నియోజకవర్గంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేశారు. 144 మంది లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, శ్రీగణేశ్ పాల్గొన్నారు. రాంపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి పేదలకు పంపిణీ చేశారు.