పెదాలు ఎర్రగా ఉండాలని చాలామంది రకరకాల లిప్స్టిక్స్, లిప్బామ్స్ వాడుతుంటారు. అయితే, ఇవి పెదాలను పొడిగా చేసి నల్లగా అందవికారంగా మారుస్తాయి. సహజసిద్ధమైన ప్రొడక్ట్స్ పెదాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి, బాదం నూనెతో మర్దన చేస్తే పెదాలపై మృతకణాలు తొలగి ఎర్రగా మారతాయి. అలొవెరా జెల్ పొడిబారిన పెదాలను మృదువుగా మారుస్తుంది. బీట్రూట్ జ్యూస్లో తేనె కలిపి మర్దనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.