TG: చేయూత పింఛన్ తీసుకునే వారిని రేవంత్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మందకృష్ణ మాదిగ విమర్శించారు. రాష్ట్రంలో 44,49,767 చేయూత లబ్ధిదారులు ఉన్నారని.. రేవంత్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నమ్మి కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు. APలో చంద్రబాబు అధికారంలోకి రాగానే.. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు పింఛనును రూ.6 వేలు పెంచి ఇచ్చారని గుర్తుచేశారు.