TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. ఈ ఉదయం 10 గంటలకు అపోలో ఆసుపత్రికి మాజీమంత్రి కేటీఆర్‌ను తీసుకుని రావాలని అన్నారు. ‘మీరిద్దరూ, నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందాము. ఎవరు దొర, ఎవరు దొంగ తేలిపోతుంది’ అని పేర్కొన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు బీఆర్ఎస్లో నీతులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.