AP: వైసీపీ పర్యాటక రంగాన్ని గాలికి వదిలేసిందని, కూటమి ప్రభుత్వంలో పర్యాటకాన్ని గాడిలో పెడుతామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. కాకినాడలోని సూర్యారావుపేట వద్ద NTR బీచ్‌ను పరిశీలించి మాట్లాడారు. జనవరిలో కాకినాడ బీచ్ ఫెస్టివెల్‌ను నిర్వహిస్తామని, అక్టోబర్ నాటికి బీచ్ పార్క్‌ను ప్రారంభిస్తామన్నారు. తీర ప్రాంతంలో బీచ్ రిసార్ట్స్ అభివృద్ది చేస్తామని, పర్యాటకులకు నీటి కొరత లేకుండా చేస్తామని పేర్కొన్నారు.