ఇండియన్ యూత్ కాంగ్రెస్(IYC) చీఫ్గా ఉదయ్ భాను ఎంపికయ్యారు. IYC కొత్త చీఫ్గా ఉదయ్ భానును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం IYC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఉదయ్ గతంలో జమ్మూకశ్మీర్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఇదివరకు IYC చీఫ్గా బివి శ్రీనివాస్ కొనసాగిన విషయం తెలిసిందే.