SRPT: ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్, తోట కిరణ్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట 8వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంను నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పుడమికి, పర్యావరణానికి ఎంతో హాని చేసే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేయాలని కోరారు.