శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో రెండో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు. దీంట్లో నేషనల్ పీపుల్స్ పవర్(NPP) పార్టీ నేత అసుర కుమార దిసనాయకే ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి రౌండ్లో దిసనాయకే 39.52 శాతం ఓట్లు సాధించగా.. విపక్ష నేత సాజిత్ ప్రేమదాస 34.28 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.