మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డూలో వివాదంపై జగన్ ప్రధాని మోదీకి బహిరంగంగా లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ..’జగన్ హిందూ ద్రోహి.. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో దారుణమైన పాపాలు చేశారు. జగన్ పాలనలో ఎన్నో ఆలయాలు నేలమట్టమయ్యాయి. వైసీపీ హయాంలో శ్రీవారి సన్నిధిలో ఎన్నో తప్పులు జరిగాయి.. రథాలు తగలబెట్టారు, విగ్రహాలను ధ్వంసం చేశారు’ అని అన్నారు.