AP: వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీపై విశ్వాసం లేకనే నాయకులు ఆ పార్టీని వీడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. గత ఐదేళ్లు ప్రజలను మెప్పించేలా పాలన జరగలేదని.. ప్రజలను హింసించేలా పాలన జరిగిందని మండిపడ్డారు. ఈ విషయం వైసీపీ నేతలకు అర్థమయ్యే ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చిన పాపానికి రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటిని వైసీపీ నేతలు నాశనం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.