TG: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం యూనివర్సిటీలకు వీసీలను కూడా నియమించలేదని ఆరోపించారు.