బిహార్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు గురిచేసింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ పరిణామాల దృష్ట్యా తన భద్రతను పెంచాలని కోరుతూ హోంమంత్రి అమిత్ షాకు పప్పూ యాదవ్ లేఖ రాశారు. ఒకవేళ తాను హత్యకు గురైతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని పేర్కొన్నారు.