గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపడుతుంది. పడుకునే ముందు ఒక కప్పు పసుపు పాలు తాగడం వల్ల వేగంగా నిద్రపోవచ్చు, మరింత ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించవచ్చు. కాబట్టి పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు.