TG: నవంబర్ 6 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రకియ చేపట్టనున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. దేశంలో తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని రాష్ట్రనేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో CM రేవంత్ రెడ్డి, DY. CM భట్టి విక్రమార్క పాల్గొన్నారు. త్వరలో దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు.