సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. అతని పేరును సీజేఐ చంద్రచూడ్ సిఫార్సు చేయడంతో రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ఆమోదం తెలిపారు. దీంతో అతని పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో సీజేఐగా సంజీవ్ ఖన్నానవంబర్ 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ వెల్లడించారు.