AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వం వచ్చాక తిరుమలలో శాస్త్రీయబద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడిందని పేర్కొన్నారు. అమరావతి రైల్వేలైన్కు ఆమోదం వచ్చిందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని వెల్లడించారు.