AP: తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్ అయింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనుంది. ఈ మేరకు టీటీడీ ఈవో ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావటంతో CBI విచారణకు సిపార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తోంది. ఈ విషయంపై రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.