ఢిల్లీతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్లోని లాహోర్లో గాలి కాలుష్యం మితిమీరిపోయింది. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1900గా నమోదైంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా లాహోర్ చెత్త రికార్డును సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో వారం పాటు ప్రైమరీ స్కూల్స్ మూసివేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. ప్రజలందరూ మాస్క్ ధరించాలని అధికారులు సూచించారు.