ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో భారీగా నగదు పట్టుబడింది. ఏలావూర్ చెక్‌పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.16 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకొని ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.