జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కలబంద, పెరుగు మిశ్రమం జుట్టుకు తగినంత పోషణ అందిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కలబంద గుజ్జుకి 2 స్పూన్ల పెరుగు, 2-3 చుక్కల టీట్రీ, జోజోబా ఆయిల్ కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి 2సార్లు ఇలా చేస్తే జుట్టుకు తేమ అంది మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్య దూరమవుతుంది. వెంట్రుకలు చిట్లటం తగ్గుతుంది.