TG: కాంగ్రెస్ సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. జగిత్యాలలో తమదే అసలైన కాంగ్రెస్ కుటుంబం అని వెల్లడించారు. జీవన్ రెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గం నుంచి వచ్చేసి ఇంకో పార్టీతో కలవలేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే కాంగ్రెస్లో చేరానని స్పష్టం చేశారు.