TG: గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో చలో సెక్రటేరియట్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన హైదరాబాద్ అశోక్‌నగర్ చౌరస్తాకు వెళ్లి గ్రూప్-1 బాధితులను పరామర్శించారు. సెక్రటేరియట్ పిలుపుతో గ్రూప్-1 అభ్యర్థులు భారీగా రోడ్డుపైకి వచ్చారు. గ్రూప్-1 వాయిదా వేయాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.