TG: రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గ్రూప్-1 మెయిన్స్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రకటన చేయనుంది. అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు నిన్న రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.