రోగనిరోధక శక్తి పెంచడంతోపాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో గ్రీన్ టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. గంట తర్వాత తాగాలి. రోజుకూ 2-3 కప్పుల కంటే ఎక్కువగా తాగొద్దు. గ్రీన్ టీలో కెఫీన్ కంటెంట్ ఉండటంతో నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది. ఎసిడిటీ, అల్సర్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి.