కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే దీన్ని తాగితే అధిక బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సమస్యలు దూరమవుతాయి. అధిక రక్తపోటు, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి.