AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగంగా జరుగుతోంది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 64.14 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందజేశారు. కాగా, ఈనెల పింఛన్దారులకు రూ.2,710 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.