SKLM: పోలాకి మండలం జాడూరు గ్రామంలో శుక్రవారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పర్యటించారు. ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు మంజూరు అయిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను నేరుగా ఎమ్మెల్యే తన చేతులతో అందించారు. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక క్రమ పద్ధతిలో అన్ని సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.