TG: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని KTR డిమాండ్ చేశారు. బడ్జెట్ను మించి గ్యారెంటీలు ఇవ్వకూడదని, అలా చేస్తే దివాళా తీసే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని ప్రశ్నించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి మీకు తెలియదా అని మండి పడ్డారు.