AP: విశాఖ సిరిపురం జంక్షన్లో ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమంలో మంత్రి డీబీవీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. యుద్ధప్రాతిపదికన రోడ్లపై ఉన్న గుంతలన్నీ పూడ్చుతామని వెల్లడించారు. త్వరలో విశాఖ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు.