భారత్ నేడు ‘విశ్వమిత్ర’గా ఎదుగుతోందని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికపై కొంతమంది స్నేహితులు క్లిష్టంగా ఉండొచ్చని, అలాంటి వారు పరస్పర గౌరవం, దౌత్యపరమైన మర్యాద వంటివి పాటించకపోవచ్చని పేర్కొన్నారు. కెనడాతో దౌత్యవివాదాలు కొనసాగుతున్న వేళ జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.