TG: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. విమర్శల విషయంలో హద్దు మీరొద్దన్నారు. BRS వ్యవహారం నచ్చకే ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఏది పడితే అది మాట్లాడటానికి సంస్కారం అడ్డొస్తుందన్నారు. KTRకు లీగల్ నోటీసులు పంపిస్తానని, అతనికి డ్రగ్స్‌తో సంబంధం లేదని ప్రమాణం చేయాలన్నారు. దీపావళిలోపు BRS నేతలను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ అంటుందని తెలిపారు.