TG: ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సర్వే నంబర్లు మార్చేసి.. తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై చర్యలుంటాయని చెప్పారు. హైడ్రా కూల్చిన తర్వాత వ్యర్థాలను ఆ బిల్డరే తొలగించాలన్నారు. అక్కడ పూర్వస్థితికి భూమిని తీసుకురావాల్సిన బాధ్యత బిల్డర్లపైనే ఉందని పేర్కొన్నారు.