TG: దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో కార్తీకమాస దీపోత్సవాలు జరపాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 1 వరకు కార్తీక దీపోత్సవాలు జరగనున్నాయి. రోజూ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులకు ఉచితంగా 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఇవ్వాలని.. ప్రధాన ఆలయాల్లో మహిళా భక్తులకు పూజా సామగ్రి పంపిణీ చేయనున్నారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.