TG: మూసీ బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. నాగోల్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్లో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేశాం. మేము నిర్మించిన ఎస్టీపీలు ప్రారంభించి కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్కు కొత్తగా చేసిందేమీ లేదు. భాగ్యనగరానికి వరమైన మూసీ.. కాంగ్రెస్ పాలనలోనే మురికికూపంగా మారింది’ అని పేర్కొన్నారు.