AP: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. రేపో, ఎల్లుండో నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.. ఇందులో 340 షాపులను కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై అబ్కారీ శాఖ కసరత్తు చేస్తుంది. ఏయే నియోజకవర్గాల్లో ఎంత మేరకు కల్లుగీత కార్మికులు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తుంది.