అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో పలు సర్వేలు ఎవరికి ఎంత మద్దతు ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తాజాగా ‘ఇండియన్ అమెరికన్ అటిట్యూడ్ సర్వే’ డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్ వైపు 61% మంది భారతీయ అమెరికన్లు ఉన్నారని వెల్లడించింది. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 31% మంది ఉన్నారని తెలిపింది. కాగా, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నిక జరగనుంది.