అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ గెలుపొందాలని ఆమె స్వగ్రామమైన తమిళనాడు తులసేంద్రపురంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ప్రజలు హారిస్ గెలుపు కోసం అక్కడి అమ్మవారి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేశారు. హారిస్ తాతగారైన పీపీ గోపాలన్ వందేళ్ల క్రితం ఈ గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత చెన్నైకి వెళ్లి ప్రభుత్వాధికారిగా రిటైరయ్యారు.