కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో కంటెంట్ క్రియేటర్లకు మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షాపింగ్ ప్రోగ్రామ్ అనే ఫీచర్‌ను ప్రారంభించింది. దీంతో అర్హులైన క్రియేటర్లు తమ వీడియోతో ఉత్పత్తులను ట్యాగ్ చేసి రెవెన్యూ రాబట్టుకోవచ్చు. దీని కోసం మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది.