TG: ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇందిరాపార్క్ వద్ద ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలిపేందుకు ఎమ్మెల్యే అక్కడికి వెళ్లారు. అయితే ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ఇందిరాపార్క్ నుంచి తిరిగి వెళ్లిపోవాలని చెప్పారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని.. ఈ ధర్నాను రాజకీయం చేయొద్దని ఆయన్ను ఆటో డ్రైవర్లు కోరారు.