TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు తప్ప మిగతా హామీలు అన్నీ తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి మహిళకు రూ.25 వేలు బాకీ ఉందని.. గ్రామాల్లోప్రతి మహిళకు ఈ విషయాన్ని వివరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు.