AP: నెల్లూరులో ఉచిత ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు, ట్రాక్టర్ల యజమానుల అభిప్రాయాలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలుసుకున్నారు. అప్పట్లో రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఉన్న ట్రాక్టర్ ఇసుక.. ఇప్పుడు వెయ్యికే వస్తుందని యజమానులు తెలిపారు. వైసీపీ హయాంలో ఇల్లు కట్టాలంటే ఇసుకకే నాలుగైదు లక్షలు ఖర్చయ్యేదన్న బిల్డర్లు.. ఇప్పుడు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక రూ.లక్షకే అందుతోందని హర్షం వ్యక్తం చేశారు.