ఉగ్రవాదులకు దీటైన జవాబు ఇస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులు దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఇటీవలికాలంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.స్థానికంగా భద్రతాపరంగా ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు బలగాలు దీటైన జవాబు ఇస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.