TG: పండుగవేళ BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘పిల్లలు బాంబులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉండండి. లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశముంది. పండుగరోజు లక్ష్మీమాతను పూజిస్తాం. కానీ అదే లక్ష్మీమాత బొమ్మ ఉన్న పటాకులను మనకు అమ్ముతున్నారు. ఈ కుట్ర ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. ఒక సంకల్పంగా తీసుకుని మన దేవుడి బొమ్మ ఉన్న పటాకులు కొనడం మానేస్తే.. ఎవ్వరూ అమ్మరు’ అని అన్నారు.