ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తమ దేశంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిన నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. దేశ రక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని వెల్లడించింది. ఈ క్రమంలో ఎదురు దాడులకు దిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ తెలిపింది. పరస్పర హెచ్చరికలతో పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం కనిపిస్తోంది.