TG: గ్రూప్-1 అభ్యర్థులను చర్చలకు పిలవకపోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సిందేనని సూచించారు. బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌కి భద్రత ఇచ్చి రేవంత్ ర్యాలీ చేయించారని ఆరోపించారు. బండి సంజయ్ ఏం చదువుకున్నారని.. ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే ఆయనకు తెలుసు అని విమర్శించారు.