AP: ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ ద్వారా పౌర సేవలను మరింత సులభంగా అందించేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, విద్యా శాఖ మినిస్టర్ నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వ అధికారులు, మెటా సంస్థ ప్రతినిధులు దిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో కాస్ట్ సర్టిఫికెట్ సహా కరెంట్, వాటర్, హౌస్ ట్యాక్స్, ఇతర బిల్లులు ఇకపై వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు.