జార్ఖండ్ ఎన్నికల వేళ ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సీపీఎం మేనిఫెస్టో విడుదల చేశాయి. రూ.450కే సిలిండర్, ఒక్కో వ్యక్తికి నెలకు 7కేజీల ఆహార ధాన్యాలు, 10లక్షల మందికి ఉపాధి, రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా, వరికి మద్దతు ధర రూ.2400 నుంచి రూ.3200, మహిళలకు నెలకు రూ.2500, వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక కమిషన్, మైనారిటీల హక్కులకు రక్షణ వంటివి ముఖ్య హామీలుగా ప్రకటించింది.