తిరుపతి లడ్డూ వివాదంపై ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కీలక వ్యాఖలు చేశారు. ‘ఆలయ ప్రసాదంలో గొడ్డు మాంసం ఉండటం అసహ్యకరం. దేవాలయాలు ప్రభుత్వాల ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలి. భక్తి లేని చోట పవిత్రత ఉండదు. ఒకానొక సమయంలో హిందూ దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులైన హిందువులచే నిర్వహించబడ్డాయి’ అని తెలిపారు.