WNP: వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని.. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలు జారీ చేస్తామని MLA మేఘారెడ్డి ఆదివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. స్కాన్ చేసి బియ్యం పొందేలా కార్డులను రూపకల్పన చేస్తామన్నారు. జనవరి నుంచి సన్న బియ్యం, ఈ సీజన్ నుంచే రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు.